ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`హిరణ్యకశిప` భారీ విజయాన్ని సాధిస్తుందట!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 06:41 PM



రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో `హిరణ్యకశిప` తెరపైకి రాబోతోంది. ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా ప్రీప్రొడక్షన్ వర్క్ అమెరికా- హైదరాబాద్ సహా పలు చోట్ల జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ `రుద్రమదేవి` తరువాత ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టాడు. ఈసారి ప్రొడక్షన్ డిజైన్ పరంగా సుదీర్ఘ సమయం తీసుకుని ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. పనిదినాల కారణంగా బడ్జెట్ పెరుగకుండా.. అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసేలా ప్రతిదీ పక్కాగా ప్రీప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసేందుకు ఆస్కారం ఉందని.. భారీ విజయాన్ని సాధిస్తుందని డి. సురేష్ బాబు పదే పదే చెబుతున్నాడు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్.. గ్రాఫిక్ డిజైనర్ పని చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా పని పూర్తి చేసినట్టు టాక్ వినిపిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com