ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటసారి స్వయంగా డబ్బింగ్ చెప్పిందట..

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 11:51 AM



క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా బబ్లీ బ్యూటీ రాశీఖ‌న్నా, అలాగే ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌ గా ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రాబోతున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి కూల్ కంపోజర్ గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


 


 


కాగా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ గత చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ కు హిట్ ఇస్తోందా.. టైటిల్ అయితే క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పిందట, అలాగే ఐశ్వ‌ర్యా రాజేష్‌ కూడా తన రోల్ కు డబ్బింగ్ చెబుతుందట. ఏమైనా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం హీరోయిన్స్ వరుసగా డబ్బింగ్ చెబుతున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com