ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖరారైన "పలాస 1978" రీలీజ్ డేట్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 01:20 PM



వైవిధ్యభరితమైన కథాకథనాలతో 'పలాస 1978' సినిమా రూపొందింది. అట్లూరి ధ్యాన్  నిర్మించిన ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి రఘు కుంచె సంగీతాన్ని సమకూర్చాడు. రక్షిత్ - నక్షత్ర నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో రఘు కుంచె కూడా ఒక కీలకమైన పాత్రను పోషించాడు.


తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. వచ్చేనెల 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఈ  సినిమాపై అందరిలో మరింతగా ఆసక్తి పెరిగిపోయింది. సహజత్వానికి దగ్గరగా మలచబడిన పాత్రలతో సాగే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com