ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిందు మాధవి లేటెస్ట్ స్టిల్స్ చూస్తే కచ్చితంగా

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 11:16 AM



అరవిరిసిన నవ్వుతో అమాయకమైన మోముతో.. ఒకింత భయంగా..  ఒకింత ఇష్టంగా పల్లెటూరు నుంచి నగరానికొచ్చిన యువతి పాత్రలో ఆవకాయ్ బిర్యాని సినిమాలో కనిపించింది బిందుమాధవి. కమర్షియల్ హీరోయిన్ ఉండాల్సిన అన్ని క్వాలిటీలు ఉన్న అచ్చ తెలుగు అందం కావడంతో బాగానే రాణిస్తుందని అంతా అనుకున్నారు. అన్నీ బాగానే ఉన్నా ఎందుకో ఇండస్ట్రీని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. 


డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన బంపర్ ఆఫర్ సినిమాలో గ్లామర్ లుక్ తో.. హస్కీ వాయిస్ తో బాగానే మెప్పించింది. కానీ ఆ తరవాత సినిమాల్లో ఆఫర్లేమీ లేకపోవడంతో జనాలంతా ఆమెను మర్చిపోయారు. తనలోని అసలైన గ్లామర్ అసెట్స్ ఏంటో అందరికీ తెలిసేలా ఈమధ్య ఓ మ్యాగజైన్ కు ఫొటో షూట్ చేసింది బిందు మాధవి. వయ్యారం ఒలకబోస్తూ.. నడుము ఒంపులు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు చూస్తే అందరికీ మతి పోవాల్సిందే. సోగకళ్లతో చూస్తూ తనకు అలవాటైన అరవిరిసిన చిరునవ్వుతో నించున్న ఆమెను చూస్తే చిత్తయిపోవాల్సిందే. 


ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలంటారు. జాన తెలుగు సొగసరి బిందుమాధవి లేటెస్ట్ స్టిల్స్ చూస్తే కచ్చితంగా ఈ మాట నిజమనిపించక మానదు. పోతపోసిన పున్నమి ప్రాణం పోసుకుని తిరుగాడినట్టు కదిలే వెన్నెల శిల్పం కళ్లముందుకొచ్చి నిలుచున్నట్టుగా ఉన్న బిందుమాధవి అందం ఏ భావుక దర్శక నిర్మాతలైనా కదిలించకపోతుందా.. చూద్దాం.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com