బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నాడనే వార్తలు బీ టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. తన మాజీ భార్య సుసాన్నే ఖాన్నే హృతిక్ మరోసారి పెళ్లాడబోతున్నాడని చెబుతున్నారు. వారిద్దరూ ప్రేమించుకుని 2000లో పెళ్లి చేసుకున్నారు. 2014లో విడిపోయారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వారిద్దరూ విడిపోయినప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. ఇటీవల హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా సుసాన్నే చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షించింది. తన జీవితంలో ఎప్పటికీ హృతికే వెలుగు అని, ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని ట్వీట్ చేసింది. అంతే కాదు, స్వయంగా బర్త్డే పార్టీకి వెళ్లి విష్ చేసింది. దీంతో వారిద్దరూ మళ్లీ కలబోతున్నారని అందరూ చెబుతున్నారు.