ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాక్షన్ .. ఎమోషన్ గా రానున్న 'సీటీమార్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 07:21 PM



తెలుగులోని యాక్షన్ హీరోల్లో గోపీచంద్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఆయన సినిమాల్లో ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీ ఇలా ఏ అంశాలు ఉన్నప్పటికీ యాక్షన్ పాళ్లే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ సారి ఆయన కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ 'సీటీమార్' సినిమా చేశాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నా కనిపించనుంది.కబడ్డీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కథా పరంగా యాక్షన్ .. ఎమోషన్ ఎక్కువగా వుంటాయనే ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో కామెడీ కూడా కావలసినంత ఉంటుందని చెబుతున్నారు. గోపీచంద్ - వెన్నెల కిషోర్ కి మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఆద్యంతం నవ్విస్తుందని అంటున్నారు. సెకండాఫ్ కామెడీ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గతంలో 'గౌతమ్ నంద' సినిమాతో పరాజయాన్ని చూసిన సంపత్ నంది - గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతారేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com