ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ప్రశ్నకు ఫైర్ అయినా జబర్దస్త్ కమెడియన్ వినోద్..

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 07:22 PM



మీరు అమ్మాయా.. అబ్బాయా.. ఇదే ప్రశ్న ఇప్పుడు ఓ జబర్ధస్త్ కమెడియన్‌కు ఎదురుపడింది. ఓ అబ్బాయిని అలాంటి ప్రశ్న అడిగినపుడు ఎవరైనా ఏ సమాధానం చెప్తారు..? ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు. తాను మగాన్ని అనే విషయం త్వరలోనే నిరూపిస్తానంటున్నాడు. ఆయనే వినోద్.. జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్ళకు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆడ వేషాల నుంచి ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అసలు వినోద్‌ను అబ్బాయిగా చూసి కూడా చాలా రోజులు అయిపోయింది.ఒక్కసారి మేకప్ వేసుకుని స్టేజీపైకి వచ్చాడంటే అమ్మాయిలు కూడా ఔరా అనుకోవాలి. అంత అందంగా ముస్తాబవుతాడు వినోద్. అయితే మొన్నటి వరకు జబర్దస్త్ షోతో బిజీగా ఉన్న ఈయన.. ఇప్పుడు మాత్రం వివాదాలతో బిజీ అయిపోయాడు. అప్పుడెప్పుడో ఓ సారి సూసైడ్ అటెంప్ట్‌తో అందర్నీ తన వైపు తిప్పుకున్న వినోద్.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ మధ్యే ఈయనపై ఇంటి ఓనర్ దాడి చేయడం సంచలనంగా మారింది.ఇప్పుడు ఈ విషయాలతో పాటు మరిన్ని విషయాలు కూడా చెప్పాడు జబర్దస్త్ వినోద్.ముఖ్యంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. ఈ జబర్ధస్త్ కమెడియన్ తీరు ముందు నుంచి కూడా ఎందుకో కానీ కాస్త వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. అలాగే క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు ఈయన. గతంలో ఒకసారి వినోద్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నింగా ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పుడే సంచలనం అయింది ఈ విషయం. ఆ తర్వాత మళ్లీ జబర్దస్త్ షో చేసిన ఈయన ఇప్పుడు దాడి ఘటనతో ఫేమస్ అయ్యాడు. పూర్తిగా కోలుకున్న వినోద్.. ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ చేస్తున్నాడు.ఈయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీరు నిజంగానే అబ్బాయా లేదంటే అమ్మాయా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఫైర్ అయిపోయాడు వినోద్. నేను మగాన్ని.. తేడాగాన్ని కాదు.. త్వరలోనే పెళ్లి చేసుకుని అందరి నోళ్లు మూయిస్తానంటున్నాడు వినోద్. ఈయన తన మరదలితోనే ఏడడుగులు నడవబోతున్నాడని తెలుస్తుంది.. ఇప్పటికే ఓసారి దాడి కారణంగా పెళ్లి ఆగింది. మళ్లీ ఎప్పుడవుతుందో తెలియదు.. మొత్తానికి తను అమ్మాయి అంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని.. అసలు సిసలైన మగాన్నే అంటున్నాడు ఈయన.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com