ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ ఇంటికి కరోనా సెగ తాకింది. నటి రేఖ ఇంట్లో పని చేసే సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె ఇంటిని బీఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆమె ఇంటి బయట కంటైన్మెంట్ జోన్ అని అధికారులు నోటీసులు అంటించారు. బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్, కరణ్ జోహార్, బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే సిబ్బంది సైతం ఈ మధ్యే వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.