ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమలాపాల్ పాత్రని పోషించనున్న ‘శ్రద్ధాకపూర్’

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 10, 2020, 10:44 AM



బాలీవుడ్ హీరోయిన్ నగ్నంగా నటించనుందని సమాచారం. నటి  అమలాపాల్ నటించిన `ఆమె` తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఆడై పేరుతో తమిళంలోనూ బంపర్ హిట్ కొట్టింది. రోడ్లు.. పార్కుల్లో ప్రజలను ప్రాంక్ చేయబోయి తానే ఎరక్కపోయి ఇరుక్కుపోయే మీడియా అమ్మాయిగా అమలాపాల్ అద్భుతంగా నటించింది. సినిమా ఆద్యంతం ఒంటిపై నూలు పోగైనా లేకుండా నగ్నంగా కనిపించాల్సిన సన్నివేశంలో ఆ లేడీ టీవీ రిపోర్టర్ (ఆమె) ఏం చేసింది? అన్నది దర్శకుడు రత్నకుమార్ ప్రతిభావంతంగా తెరపై చూపించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారట. అమల పాల్ పాత్రలో శ్రద్ధ కపూర్ నటించనుందని సమాచారం. సినిమా ఆద్యంతం కేవలం ఒకే ఒక్క పీలిక లాంటిది ఒంటిపై కప్పకుని శ్రద్ధ కనిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com