ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అ’ మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 01:00 PM



న‌టీన‌టులు – నానీ, ర‌వితేజ‌, కాజ‌ల్, నిత్యా మీన‌న్, రెజీనా, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, ముర‌ళీ శ‌ర్మ‌, ప్రియ ద‌ర్శి త‌దిత‌రులు
సంగీతం : మార్క్ . కె . రాబిన్స్ 
సినిమాటోగ్ర‌ఫీ – కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని 
ఎడిట‌ర్ – గౌత‌మ్ నెరుసు 
క‌థ‌, క‌థ‌నం,దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత‌ :- నాని
బ్యాన‌ర్ – వాల్ పోస్ట‌ర్ 
విడుద‌ల తేది -16.02.2018


నేచుర‌ల్ స్టార్ నానీ.. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీద ఉన్న న‌టుడు.. అలాంటి హీరోకి ఓ యువ‌కుడు ఓ క‌థ వినిపించాడు.. ఆ క‌థ విన్న‌వెంట‌నే నానీ అ అంటూ షాక్ అయ్యాడు.. ఇటువంటి క‌థ ఇంతవ‌ర‌కు ఏ భాష‌లోనూ రాక‌పోవ‌డంతో నానీ ధైర్యం చేశాడు.. అత‌డే నిర్మాత గా మారాడు.. అలా రూపు దిద్ద‌కున్న మూవీ అ.. తొమ్మిది పాత్ర‌ల చుట్టూ తిరిగే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో సైతం అస‌లు క‌థ ఏంటో చెప్ప‌లేదు నానీ..చూడంండి..చూసిన త‌ర్వాత మీరూ అ అంటారు అంటూ భ‌రోసా ఇచ్చాడు.. ఈరోజే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది..మ‌రి ఎలా ఉందో తెలుసుకుందాం రండి..


క‌థ‌  : ఈ మూవీ క‌థ గురించి చెబితే అస‌లు సినిమా లో ఉన్న కిక్ పోతుంది.. ఇదో సైంటిఫిక్ ఫిక్ష‌న్.. సెంటిమెంట్ ఉంది.. చ‌క్క‌టి సందేశం ఉంది.. ప్ర‌తి పాత్ర‌లోనూ ఒక వైవిధ్య‌మైన క‌థ క‌ళ్ల‌ముందు సాక్ష్యాత్కారమ‌వుతుంది. నానీ చేప‌గా, ర‌వితేజ చెట్టుగా మారి చెప్పిన డ‌బ్బింగ్ వేనుకే ఓ చ‌క్క‌టి సందేశం ఉంది. ఇక కాజ‌ల్, నిత్యామీన‌న్, ఈషా రెబ్బా, రెజీనా, ముర‌ళీ శ‌ర్మ‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, ప్రియ‌ద‌ర్శి, ఓ పాప‌… వీళ్ల మ‌ధ్యే క‌థ అంతా సాగుతుంది..ప్ర‌తి పాత్ర విడివిడిగా ఎంట్రీ ఇచ్చినా చివ‌రికి ప్ర‌తిపాత్ర‌కు లింక్ ఉంటుంది..ప్ర‌తి పాత్ర‌ను క‌లుపుకుంటూ యంగ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ్ అద్భుతంగా స్క్రీన్ ప్లే రాసుకుని తెర‌పై చూపిన విధానం అంద‌రూ అ అంటూ ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే… అస‌లు క‌థే నూత‌న‌త్వం అనుకుంటూ ఇక తీసే విధానంలో మ‌రింత కొత్త‌గా తీశాడు ప్ర‌శాంత్. ఈ సినిమా కోసం అత‌డు ప‌డిన త‌పన , శ్ర‌మ అంతా స్రీన్ పై క‌నిపిస్తుంది.. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైన కాజ‌ల్, రెజీనాల‌తో పాటు ఈషా రెబ్బా, నిత్యా మీన‌న్ త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు.. అవ‌స‌రాల‌, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీ శ‌ర్మ‌లు సినిమాను నిల‌బెట్టారు.. సినిమాటోగ్ర‌ఫీ తో కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని మాయ చేస్తే, రాబిన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మూవీకి మ‌రింత హైప్ తెచ్చాడు. ఇంత వ‌ర‌కూ ఇండియ‌న్ ఫిల్మ్ చ‌రిత్ర లో ఇటువంటి మూవీ రాలేదు.. నానీ చాలా ధైర్యంగా క‌థ‌ను న‌మ్మి, నిర్మాణ విలువ‌ల్లో రాజీ ప‌డ‌కుండా తీసిన చిత్రం అంద‌రూ త‌ప్ప‌క చూడాల్సిందే.. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో ఈల‌లు వేసే సినీ ప్రేక్ష‌కులు ఈ మూవీ చూస్తే సినిమాలు ఇలా కూడా తీయ‌వ‌చ్చా అంటూ ‘అ’ అని నోరు తెర‌వ‌డం గ్యారంటీ… కొత్త‌ద‌నం కోరుకునే ప్రేక్ష‌కుల‌కు బెస్ట్ మూవీ… త‌ప్ప‌కుండా ఈ మూవీ హిట్ జాబితాలోనే కాదు మంచి చిత్రాల జాబితాలో కూడా చోటు ద‌క్కించుకుంటుంది. చివరగా ఈ మూవీ కథను రివీల్ చేసి ధ్రిల్ ను మిస్ చేయవద్దంటూ నానీ చేసిన వినతిని గౌరవిస్తూ కథ ను సస్సెన్స్ లో ఉంచడం జరిగింది.. ఇంతకీ ఈ మూవీ నిడివి కేవలం 115 నిమిషాలే..


మూవీ రివ్యూ : 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com