సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ గత కొంత కాలంగా చేస్తోన్న పాత్రలు చాలా డిఫెరెంట్ గా ఉంటున్నాయి. హాట్ గా అకనిపించడమే కాకుండా అందరు మాట్లాడుకునేలా సినిమాలను ఎంచుకుంటోంది. చివరగా గరుడావవేగ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన శ్రద్దా ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండే క్యారెక్టర్ తో రాబోతోందట. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ఉద్గార్ష అనే సినిమాలో నటిస్తోంది.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు సినిమాకు సంబందించిన విషయాలను గురించి అలాగే తన పాత్ర గురించి వివరించింది. శ్రద్దా మాట్లాడుతూ..ఇందులో నేను కృతిక అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. మోడలింగ్ ప్రపంచంలో కొనసాగిన తరువాత వచ్చే పాత్ర చుట్టూ కథ నడుస్తుంది. చాలా కొత్తగా అనిపించడమే కాకుండా నేను చాలా సెక్సీగా కనిపిస్తాను. సినిమాలో ప్రతి సన్నివేశం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ థ్రిల్లర్ కథను దర్శకుడు సునీల్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు.
ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే అందరిని చాలా ఆశ్చర్యపరుస్తుంది. నా గత సినిమాలోని పాత్రలకు ఈ సినిమాలో చేసిన పాత్రకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కన్నడ బాషలోనే కాకుండా తెలుగులో కూడా సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి. కొన్ని సార్లు చేసిన సీన్స్ రెండు సార్లు చేయలేక తప్పలేదు. సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నట్లు శ్రద్దా వివరించింది. మరి ఈ సినిమా శ్రద్దా దాస్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.