ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగ బిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 22, 2020, 01:04 PM



తెలుగు తమిళ నటుడు అర్జున్ సర్జా కన్నడ నటుడు చిరంజీవి సర్జాకు అంకుల్ అని తెలిసిందే. చిరంజీవి సర్జా ఇటీవల గుండెపోటుతో కేవలం 35 ఏళ్ల వయసులోనే మరణించాడు. ఆయన అకాల మరణం ఆయన అభిమానులకు తీవ్ర బాధను కలిగించింది. అయితే చిరంజీవి చనిపోయే సమయానికి అతడి భార్య మేఘన రాజ్ గర్భవతి. ఇటీవలే ఆమెకు సీమంతం కూడా చేసారు కుటుంబ సభ్యులు. మేఘనా రాజ్ తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడు అంటూ ఇప్పటికే ధృవ బాగా ఎమోషనల్ అవుతున్న సందర్భంలో.. వారికి ఈ వార్త ఎంతో సంతోషాన్ని కలిగించే విషయమే. చిరంజీవి చనిపోయిన తర్వాత వదిన మేఘనా రాజ్‌కు అన్నీ తానే అయి చూసుకుంటున్నాడు ధృవ. జూన్ 7న చిరంజీవి సర్జా కన్నుమూసినప్పుడు అతను ఆమె పక్కనే ఉండిపోయాడు. అన్నయ్య లేకపోయినా కూడా మేఘనను తల్లిలా చూసుకుంటున్నాడు ధృవ. ఇక ఇక్కడ మరో విశేషమేమంటే.. ఈరోజు చిరంజీవి, మేఘనల ఎంగేజ్ మెంట్ డే. దీంతో వారి ఆనందం రెట్టింపు అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com