బిగ్ బాస్4 షోకి హోస్ట్ గా హీరో నాగార్జున చేస్తున్నారు. ఈ షోపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. శని, ఆదివారాలలో నాగార్జున సందడి ఇటు ప్రేక్షకులతో పాటు అటు హౌజ్‌మేట్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్లో భాగంగా నాగార్జున తన టీంతో కలిసి మనాలీకి వెళ్ళారు. ఈ క్రమంలో ఆయన ఈ శని, ఆది వారాలలో బిగ్ బాస్ షోని హోస్ట్ చేయడని వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో నాగ్ కోడలు సమంత బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టనుందని సమాచారం.