ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో భర్త గురించి నిజాలు బయటపెట్టిన హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 22, 2020, 02:20 PM



సినీనటి వనితా విజయ్‌కుమార్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. విబేధాల కారణంగా మూడో భర్తను ఆమె కొట్టి ఇంటి నుంచి తరిమేసినట్లు రెండ్రోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అసలే వనిత అక్రమంగా పెళ్లి చేసుకుందంటూ అప్పట్లో విమర్శించిన వాళ్లంతా ఈ ఘటనతో మళ్లీ ఆమెను టార్గెట్ చేశారు. దీనికి తోడు సోషల్‌మీడియాలో కూడా వనితపై విపరీతంగా ట్రోల్ జరుగుతోంది. దీంతో బయటికి వచ్చిన ఆమె ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చింది. ‘ప్రేమలో విఫలం కావడం అలవాటై పోయింది. కానీ దేన్నైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉన్నా. ప్రేమని నమ్ముతూ మోసపోవడం చాలా బాధగా, నొప్పిగా ఉంది. ఆ విషయం ఎవరికీ తెలీదు. జీవితం ఒక పాఠం. ఇంకా నేను నేర్చుకుంటున్నా. ఫేక్ వార్తలను నమ్మొద్దు. నేనే తప్పూ చేయలేదు. నా కలలు, జీవిత ఆశలు చెదిరిపోయే స్థితిలో ఉన్నాయి. ఎంతో పాజిటివ్‌గా ఉన్నా, భయంగా ఉంది’ అంటూ తన బాధను వ్యక్తం చేస్తూ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసింది.
‘నేను మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో పీటర్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు. అతడితో ఆ అలవాటు మాన్పించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా వల్ల కాలేదు. వారం రోజుల పాటు ఏమీ తినకుండా మద్యం తాగాడు. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోతే.. అతడి అసిస్టెంట్ ఇంటికి తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో కామెంట్లు, ఆరోపణలతో డిప్రెషన్‌కు గురయ్యాడేమోనని భావించి గోవా ట్రిప్‌కు తీసుకెళ్లాను. అక్కడ హ్యాపీగా గడిపి ఇంటికి రాగానే.. పీటర్ సోదరుడు చనిపోయినట్లు ఫోన్ వచ్చింది. నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిన వాడు ఇప్పటివరకు తిరిగి రాలేదు. నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. మొదటి భార్య, పిల్లలతోనే తాను ఉండాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. అతడికి నాకంటే మద్యం ఎక్కువని అర్ధమైంది. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. ఈ సమస్యను కూడా సమర్థంగా ఎదుర్కొని నిలబడతా’ అని వనిత వీడియోలో వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com