ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నాని’ మరో ప్రేమగీతం విన్నారా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2018, 11:26 AM



‘అడిగా అడిగా ఎదలో లయనడిగా’ అంటూ ‘నిన్నుకోరి’ చిత్రంలో పసందైన విరహగీతాన్ని వినిపించిన నాని మరోసారి ‘నా కనులే కనని ఆ కలనే కలిశా.. నీ వలనే బహుశా ఈ వరస.. ఐ వన ఫై.. వన ఫై..’ అంటూ ప్రేమగీతాన్ని వినిపిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ నుండి లవ్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ మూవీలో నాని నాని కృష్ణ, అర్జున్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన నాని పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 


శుక్రవారం సాయంత్రం విడుదలైన ఈ లవ్ మెలోడీ మ్యూజిక్ లవర్స్‌కి వినసొంపుగా ఉంది. తమిళ సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ చక్కటి బాణీలు అందించగా... ఎల్వీ రేవంత్‌, సంజిత్‌ హెగ్డే స్వరాలను సమకూర్చారు. ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’ తాజా సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com