బాలీవుడ్ పటౌడి ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే. నటులు నిర్మాతలు ఆ ఫ్యామిలీ లో చాలా మందే ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీ గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కరీనా ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం చాలా కామన్. రీసెంట్ గా అలాంటి మూమెంట్ ని మరోసారి అభిమానులతో షేర్ చేసుకుంది. తన ఫ్యామిలీలోని కునల్ కీము ఫ్యామిలీ తో కరీనా ఫొటోకి స్టిల్ ఇచ్చింది. కీము సతీమణి సోహా అలీ ఖాన్ తన డాటర్ ని ఎత్తుకొని ఉండగా.. కరీనా తన కుమారుడితో నవ్వుతూ కనిపించింది. ఈ ఫ్యామిలీలు వీకెండ్స్ లో ఎక్కువగా కలుసుకుంటారట. ఏ మాత్రం చిన్న వేడుకలు జరిగినా అందరు ఒక చోట చేరి చాలా సరదాగా జరుపుకుంటారట. అలాగే రీసెంట్ గా చిన్న పార్టీ మూమెంట్ లో ఇలా ఇద్దరు కలిసి సంతోషంగా గడిపారు. ఆ ఫోటో మీ కోసం.