ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలకిందులుగా సమంత ఆసనం

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 04:36 PM



సినీ తారలందరికీ ఫిట్‌నెస్ మీద మక్కువ బాగా ఎక్కువేనని వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అప్‌డేటెడ్ ఫొటోస్.. వీడియోస్ చూస్తుంటే తెలుస్తూనే ఉంది. రోజులో రెండు గంటలైనా క్రమం తప్పకుండా మన హీరోలు.. హీరోయిన్లు జింలో కసరత్తులు చేస్తూ చమటలు చిందిస్తున్నారు. టాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ దాదాపు ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ద చూపిస్తున్న వారే. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, సమంత అక్కినేని ఫిట్‌నెస్ తర్వాతే ఏదైనా అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా అక్కినేని కోడలు సమంత ఒక లేటెస్ట్ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. పట్టు తప్పితే ఇంకేమైనా ఉందా అంటూ ఈ పిక్ చూసిన కొందరు నోరెళ్ళబెడుతున్నారు.


సమంత తాజాగా గాలిలో తాడుకు తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి.. గాల్లో తలకిందులుగా వేలాడుతున్న ఆసనం వేసింది. ఈ విధంగా వేలాడుతున్న పిక్‌ని అభిమానులకు షేర్ చేస్తూ.. 'లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేది' అంటూ కాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం పిక్ అండ్ సమంత ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. జింలో బరువులను ఎత్తడమే కాదు..ఇలా యోగాసనాలను వేయడం సమంతకి ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుందట. ఇక సమంత సినిమాల విషయానికొస్తే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతకి జంటగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com