ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్ల సాయం కోరిన నటి ఇంద్రజ

cinema |  Suryaa Desk  | Published : Mon, May 17, 2021, 09:08 AM



నటి ఇంద్రజ ఏంటి? నెటిజన్ల సాయం కోరడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఇంద్రజ నెటిజన్ల సాయం కోరింది. సెలబ్రిటీల సమాచారం ఉండే వికీపీడియాలో ఇంద్రజకు సంబంధించిన వివరాలన్నీ తప్పుగా ఉన్నాయట. ఆఖరికి తన పుట్టిన తేదీతో పాటు పెళ్లి తేదీ కూడా రాంగ్‌గా ఉందని, వాటిని చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉందని తెలుపుతూ.. వాటిని ఎలా సరిచేయించుకోవాలో తెలపాల్సిందిగా ఇంద్రజ తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా నెటిజన్లను కోరింది. దీనిపై నెటిజన్లు ఇచ్చిన సలహాలతో ఆమె శాటిస్‌ఫై అయినట్లుగా తెలుపుతూ.. థ్యాంక్స్ కూడా చెప్పింది.


ఇక ఇంద్రజ ప్రస్తుతం రోజా స్థానంలో 'జబర్థస్త్' షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. వాస్తవానికి ఒకప్పుడు ఆమె స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో నటుడు, బిజినెస్ మ్యాన్ అయిన అబ్సర్‌ని 2005లో వివాహం చేసుకుని.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ ఆమె 'దిక్కులు చూడకు రామయ్యా' చిత్రంలో హీరోకి తల్లిగా నటించి.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com