హీరో హీరోయిన్లకు వయసు మీద పడ్డ ఛాయలు కనిపించకుండా ఉండేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ నానాతంటాలు పడతారు. అయితే సూపర్ స్టార్ మహేశ్‌బాబు మాత్రం యంగ్‌గా కనిపించడం కాదు! ఏకంగా తన కొడుక్కి అన్నయ్యలా కనిపిస్తాడు. ఇప్పటికీ తన బాడీని అలా ఫిట్‌గా మెయింటెన్ చేస్తూ జనాలను ఆకర్షిస్తున్నాడు. మహేశ్ హెయిర్‌స్టైల్ కూడా చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. అయితే అది విగ్గా? లేదా నిజమైన జుట్టేనా? అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మహేశ్ జుట్టు నిజమైనదే అని కొందరు, కాదని మరికొందరు ఎప్పుడూ వాదోపవాదనలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరో గతంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యాధునిక హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ ద్వారా అతడు తల మీద జుట్టు అమర్చుకున్నట్లు చెప్తున్నారు. దీన్ని నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ అంటారని, ఇది చూడటానికి సహజమైన జుట్టులాగే కనిపిస్తుందని పేర్కొంటున్నారు. తాజాగా మహేశ్ నటిస్తున్న 'సర్కారువారి పాట'లోనూ అతడి హెయిర్ స్టైల్లో చిన్న మార్పులు చేసినట్లు చెప్తున్నారు. ఇక ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్‌ను బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా ఫాలో అయ్యారట. మరి మహేశ్ గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది వేచి చూడాలి మరి.