బాలీవుడ్ అందాల భామ అలియాభట్ కాల్షీట్ల కోసం ఇపుడు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కథియావాడి, బ్రహ్మాస్త్ర సినిమాల్లో ఆమె నటిస్తోంది.ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా వంతు. ఈ అమ్మడు కూడా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి షారూక్ నిర్మాణ సంస్థతో భాగస్వామ్యంలో సినిమాల్ని నిర్మిస్తోంది. ఖాన్ తో భట్స్ అలయెన్స్ గా దీనిని భావించవచ్చు.నటిగా పెండింగ్ సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తూనే.. అటు నిర్మాతగానూ బిజీ అయ్యేందుకు ఆలియా సిద్ధమవుతోంది. అలియా తన తొలి నిర్మాణమైన `డార్లింగ్స్`లో తాను నటించే పాత్రకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్- అలియా ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ సంయుక్త సహకారంతో నిర్మిస్తున్నాయి.