బుల్లి తేరా అనుష్కగా.. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన అనసూయ `రంగస్థలం'లో అత్త పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అనసూయ పోషిస్తున్న పాత్ర పేరు రంగమ్మ. హీరో రామ్ చరణ్ మాత్రం ముద్దుగా `రంగమ్మత్త' అని పిలుచుకుంటాడంట.
ఈ చిత్రంలో తన లుక్ ని ఇప్పటివరకు తన ఫ్యాన్స్ తో పంచుకోకుండా ఉండేందుకు ఎంతో కష్టపడిన అనసూయ.. వైజాగ్ లో `రంగస్థలం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన వెంటనే ట్విట్టర్ ద్వారా రివీల్ చేసింది.
సెల్ఫీ కోసం తన వెంట పడిన కుర్రాడి సెల్ ఫోన్ నేలకేసి కొట్టి వివాదంలో ఇరుక్కున్నప్పటినుంచి ట్విట్టర్ కి దూరంగా ఉంటున్న అనసూయ.. `రంగస్థలం'లో తన లుక్ పోస్ట్ చేయడం ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యింది!!