ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్షల్ ఆర్ట్స్ లో పవన్ తనయుడు 'అకీరా' .. వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 03, 2021, 01:00 PM



పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పవన్ సినిమాల్లోకి వచ్చే సమయంలో కూడా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన విద్యను అభ్యసించిన విషయం తెల్సిందే. మార్షల్ ఆర్ట్స్ లో భాగంగా అకీరా నందన్ కర్ర సామును నేర్చుకుంటున్నాడు. తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వీడియో చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అకీరా సినిమా ఎంట్రీ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అసలు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యం అకీరాకు ఉందా లేదా అనే విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అకీరా సినిమా ఎంట్రీ ఇస్తాడేమో అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. తండ్రి లాగే చాలా మొహమాటంతో పాటు తక్కువ మాట్లాడే మనస్థత్వం అయిన అకీరా మీడియాలో తక్కువగా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో అకీరా సందడి చాలా తక్కువే అనాలి.


కొందరు సెలబ్రెటీ కిడ్స్ పార్టీలు పబ్స్ అంటూ తిరుగుతూ ఉంటారు. కాని అకీరా మాత్రం తల్లితో ఏదైనా టూర్ కు వెళ్లిన సమయంలో లేదా ఇలాంటి ఏదైనా ప్రత్యేక వీడియోలు ఫొటోలతో మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. ఆరు అడుగులకు అటు ఇటుగా ఉండే అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తే మరో ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. పవన్ కు తన కొడుకు అకీరాను హీరోగా పరిచయం చేసే ఉద్దేశ్యం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అకీరాకు ఇష్టం కు పవన్ మరియు రేణు దేశాయ్ లు ప్రాధాన్యత ఇస్తారు. కనుక హీరోగా ఎంట్రీ ఇచ్చే విషయంలో అకీరాదే తుది నిర్ణయం అవుతుంది. మార్షల్ ఆర్ట్స్ ను కేవలం హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసమే నేర్చుకోరు. కనుక అకీరా నుండి వచ్చే ప్రకటన కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com