బిచ్చగాడు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ ఆంటోని తాజా చిత్రం కాళి. తెలుగులో ఈ మూవీ కాశి పేరుతో విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓకే ఓకే ఫేం ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతుగ ఉదయనిధి తెరకెక్కించారు. మార్చి 30న విడుదల కానున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బేనర్ పై నిర్మిస్తుంది. అంజలి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సునయన, శిల్పా మంజునాథ్, అమృత ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోని చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా తెలుగు వర్షెన్‌కి సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా ఉంది. తన కలలకి బాధ కలిగిన నేపథ్యంలో ఓ మనిషి ప్రయాణంకి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది. రిచార్డ్ ఎం నాథన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు విజయ్ ఆంటోని తెలుగులో రోషగాడు చిత్రంతో బిజీగా ఉన్నాడు. గణేశ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని భార్య ఫాతిమా హోమ్ బేనర్‌పై నిర్మించనుంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.