యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తనయ శివానీ .. 2 స్టేట్స్ తెలుగు రీమేక్‌తో వెండితెర ఎంట్రీ ఇస్తుందనే సంగతి తెలిసిందే. ఈ మూవీ కొద్ది సేపటి క్రితం అన్నపూర్ణ స్డూడియోలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. దర్శక ధీరుడు రాజమౌళి క్లాప్ కొట్టగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కృష్ణం రాజు దంపతులు కూడా లాంచింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ‘2 స్టేట్స్’ హిందీ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుంది. దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్ కుంచ తెలుగు వర్షెన్‌ని తెరకెక్కిస్తున్నాడు. అడవి శేషు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ చిత్రానికి సంగీతం అందించనుండగా, అడవి శేషు నటించిన క్షణం చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షానియెల్ డియో 2 స్టేట్స్ రీమేక్ చిత్రానికి పని చేస్తున్నాడు. సినిమాకి ఫ్రెష్ లుక్ వచ్చేందుకు రెగ్యులర్ యాక్టర్స్ ని కాకుండా రేర్ యాక్టర్స్ ని సెలక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ హీరోయిన్ మదర్ పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు రజత్ కపూర్ ని శివానీ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేశారని టాక్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం లక్ష్య ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందుతుంది.