ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కు మద్దతు పలికిన హీరో నాని

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 26, 2021, 04:13 PM



రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర రంగ ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రస్తావించిన పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.సినీ రంగం క్షేమంగా ఉండాలన్నదే పవన్ కల్యాణ్ ముఖ్య లక్ష్యమన్నారు. పవన్ కల్యాణ్, ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కనబెట్టేద్దామని తెలిపారు. పవన్ లేవనెత్తిన సినీ రంగం సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. “చిత్ర పరిశ్రమలో ఓ సభ్యుడిగా సీఎం జగన్‌కు, మంత్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే… తెలుగు సినిమా మరింత దెబ్బతినకముందే స్పందించండి. వెంటనే సంబంధిత సమస్యలపై చర్యలు తీసుకోండి” అంటూ నాని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com