ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్‌తో అల్లు అర్జున్‌ సెల‍్ఫీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 19, 2018, 12:06 PM



స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. సైనికుడిగా కనిపించేందుకు బన్నీ తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది.


ఈ సందర్భంగా బన్నీ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. అభిమానులకు షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని వెల్లడించిన స్టైలిష్ స్టార్‌ ‘నా హీరోయిన్ అను ఇమ్మాన్యూల్‌ అడిగిన తొలి, చివరి కోరిక ఓ సెల్పీ.. షూటింగ్‌ పూర్తయిన తరువాత అను ఇమ్మాన్యూల్‌ తో నా తొలి పర్సనల్‌ ఫొటో’ అంటూ అనుతో దిగిన సెల్ఫీని ట్వీట్‌ చేశాడు బన్నీ. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్‌ శేఖర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్‌, నాగబాబులు నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com