బాలీవుడ్ హిట్ పెయిర్లలో ఒకటి సంజయ్‌దత్, మాధురి దీక్షిత్. 1990లలో ఎన్నో హిట్ మూవీస్‌లో ఈ జంట నటించింది. సాజన్, ఖల్నాయక్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే కదా. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య అఫైర్లు ఉన్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. ఈ మధ్యే సంజయ్ బయోగ్రఫీ అంటూ వచ్చిన బుక్‌లోనూ వీళ్ల ఎఫైర్ గురించి ప్రస్తావించారు. అయితే వీటిని సంజూ ఖండించాడు. అసలు ఆ బుక్‌తో తనకు సంబంధమే లేదని, ఆ పుకార్లను నమ్మొద్దని స్పష్టంచేశాడు. ఆ తర్వాత మీడియా మాధురీ దీక్షిత్ గురించి అడిగినప్పుడల్లా సంజయ్ అసహనం వ్యక్తంచేశాడు.
ఇప్పుడీ ఇద్దరూ కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ కలంక్‌లో ఈ ఇద్దరూ నటించబోతున్నారు. రెండు దశాబ్దాల తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్‌దత్‌కు చెందిన ఓ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ షోలో భాగంగా ఒకవేళ అవకాశం వస్తే మీరు ఏ నటిని పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నిస్తే.. మరో ఆలోచన లేకుండా మాధురి దీక్షిత్ అని సమాధానమిచ్చాడు సంజయ్ దత్.