ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేయ‌డం చాలా క‌ష్టం: సన్నీ లియోన్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 24, 2018, 10:52 AM



బాలీవుడ్ భామ స‌న్నీలియోన్ ప్ర‌స్తుతం యూత్ ఐకాన్‌గా మారింది. స‌న్నీ సినిమాలంటే అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. మొన్న‌టి వ‌ర‌కు ఐటెం సాంగ్స్‌కే ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు ముఖ్య పాత్రలు పోషిస్తుంది. ద‌క్షిణాదిలోను స‌న్నీ హ‌వా కొన‌సాగుతుంది. రాజ‌శేఖ‌ర్ న‌టించిన గ‌రుడ‌వేగ చిత్రంలో ఐటెం సాంగ్‌తో మెప్పించిన సన్నీ వీరమహాదేవి అనే చారిత్రాత్మ‌క చిత్రం చేస్తుంది. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల‌లో ఇది రూపొందుతుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం స‌న్నీ గుర్ర‌పు స్వారీ, క‌త్తి సాము వంటి ప‌లు విద్య‌లు నేర్చుకుంది. అయితే త‌న లుక్ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకొనే స‌న్నీ లియోన్ ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుంది. జిమ్‌లో రెగ్యుల‌ర్‌గా క‌స‌ర‌త్తులు చేస్తుంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో క‌స‌ర‌త్తుకి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి దానికి కామెంట్ పెట్టింది. ఈ వ‌ర్క‌వుట్ చేయ‌డం చాలా క‌ష్టం. నా కాళ్ల‌కి ఉన్న బ్యాండ్ అంత ఈజీగా చేయ‌న‌వివ్వ‌దు అని ట్వీట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com