హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి చాలా మంది సెలబ్రెటీలు షాక్ అయ్యారు. ఇది ఇలా ఉండగ మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ నుండి విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విడాకుల విషయాలపై దర్శకుడు ఆర్జీవీ చేసిన కొన్ని వాక్యాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా అవుతున్నాయి. RGV పెళ్లికి ఎప్పుడు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను తెలుపుతాడు అనే విషయం అందరికి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పెళ్లి ప్రమాదాల నుంచి యువత ని హెచ్చరించడానికి సెలబ్రిటీస్ విడాకులు ఒక ట్రెండ్ సెట్టర్స్ లా ఉంది అని ట్వీట్ చేసారు. RGV చేసిన ఈ ట్వీట్ ను చాలా మంది యూట్యూబర్స్, అలాగే స్మాల్ స్క్రీన్ హీరోయిన్స్ వారి ఇన్స్టా, ఫేస్బుక్ కథనాలు 100% నిజం అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అవుతుంది.