తమిళ సూపర్ స్టార్ రజనీ, దర్శకుడు శంకర్ కలయిక చిత్రం అంటే కోలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ క్రేజ్ ఎక్కువ. వీరి కాంబినేషన్ లో వచ్చిన రోబో ఎంతటి విజయాన్ని, ఇమేజ్ ను తెచ్చి పెట్టిందో మనకు తెలియంది కాదు. ఇదే తరహాలో వీరిరువురి కలయిక లో రోబో కు సీక్వెల్ గా చిత్రం రోబో 2. భారీ బడ్జెట్ చిత్రం గా ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఈ క్రేజ్ వలనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర తెలుగు హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. గ్లోబల్ సినిమా ఏపి, తెలంగాణా హక్కుల్నిసొంతం చేసుకుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు మహాలింగం తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ కుమార్ నెగెటివ్ రోల్ చేస్తుండగా అమీ జాక్షన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2018 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.