ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగీత దర్శకుడు కావాలనే హైదరాబాద్‌ వచ్చా..

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2017, 12:24 PM



నటుడు, రచయిత హర్షవర్ధన్‌ తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన సినిమా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. మురళి, శ్రీముఖి, కిశోర్, అజయ్‌ గోష్, హర్షవర్ధన్‌ ముఖ్య తారలుగా అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్‌.కె. విశ్వేష్‌బాబు సమర్పణలో అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హర్షవర్ధన్‌ మాట్లాడుతూ ‘‘పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. కానీ, షష్టిపూర్తి కార్యక్రమాలు అలా జరగడం లేదు. పెళ్లి సైలెంట్‌గా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలనే ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. సినిమాలో ఏకైక లేడీ పాత్రను శ్రీముఖి చేశారు. 1988–89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం. ఫీల్‌ గుడ్‌ ఎలిమెంట్స్‌తో పాటు పక్కా కమర్షియల్‌ అంశాలూ ఉంటాయి. సంగీత దర్శకుడు కావాలనే నేను హైదరాబాద్‌ వచ్చా. అందుకే ఈ చిత్రానికి సంగీతం అందించా’’ అన్నారు. శ్రీముఖి, విశ్వేష్, కిశోర్, మురళి, సంతోష్, సురేష్, శ్రీధర్, కమల్, టిఎన్‌ఆర్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com