బాలీవుడ్ దర్శకుడు సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో అమితాబ్, తాప్సీ ముఖ్య పాత్రలుగా నటిస్తున్న సినిమాకు ‘బద్లా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హిందీలో ‘బద్లా’ అంటే తెలుగులో పగ అని అర్థం. ఈ సినిమా షూటింగ్ స్కాట్లాండ్లోని గ్లాస్కోలో మొదలైంది. ‘కాంట్రాటైమ్ పో’ అనే స్పెయిన్ చిత్రానికి ఇది రీమేక్. గ్లాస్కోలో షూటింగ్ మొదలైంది. త్వరలోనే నేను జాయిన్ అవుతాను. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అమితాబ్ తెలిపారు. మ్యాజిక్ రిపీట్ చేయడానికి అంతా సిద్ధమైందని తాప్సీ చెప్పింది. రెండేళ్ల క్రితం వచ్చిన ‘పింక్’ చిత్రం తర్వాత అమితాబ్ ..తాప్సీ ఈ చిత్రం కోసం మళ్లీ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని సమాచారం.