బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ సరసన నటి కృతి కర్భందా కనిపించనుందట. బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీస్‌లో హౌస్‌ఫుల్ ఒకటి. హౌస్‌ఫుల్4లో కృతి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇంతమంది స్టార్స్ ఉన్న ఈ సినిమాలో నేనింత వరకు నటించలేదు. అలాగే ఇలాంటి డిఫరెంట్ స్టోరీ కూడా నేను వినలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ అని తెలిపింది. నిజానికి కియారా అద్వానీని అనుకున్న ప్లేస్‌లో ఫైనల్‌గా కృతి రావడంతో చాలా హ్యాపీగా ఉంది ఈ భామ. ఫస్ట్ అండ్ సెకండ్ హౌస్ఫుల్స్కు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్నే ‘హౌస్‌ఫుల్ 4’ను డైరెక్ట్ చేయనున్నాడు.