ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలింఫేర్‌లో బాహుబ‌లి హ‌వా

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 17, 2018, 09:17 AM



ఇండ‌స్ట్రీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన నటీ నటులకు అవార్డులను ఇస్తూ , వారిని ఎంకరేజ్ చేసే ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం 65వ సంవ‌త్స‌రానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. 65వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జ‌రిగింది. ఈ వేడుకకి తెలుగు, త‌మిళ‌, కన్నడ, మల‌యాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున హాజర‌య్యారు. తార‌ల సంద‌డితో ఆ ప్రాంగణం కోల‌హాలంగా మారింది. తెలుగులో బాహుబ‌లి 2 చిత్రం ప‌లు అవార్డులు కొల్ల‌గొట్ట‌గా, ఉత్త‌మ నటుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ (అర్జున్ రెడ్డి), ఉత్త‌మ న‌టి సాయి ప‌ల్ల‌వి (ఫిదా) , ఉత్త‌మ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ( బాహుబ‌లి) ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డు అల్లు అరవింద్ చేతుల మీదుగా అందించారు. ప‌లు భాష‌ల‌కి సంబంధించిన అవార్డులు వివ‌రాలు ..


తెలుగు
- ఉత్తమ చిత్రం - బాహుబలి 2
- ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2)
- ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)
- ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా)
- ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా)
-ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు)
- ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2)
- ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2)
- ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే
- ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్)
- జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ
- ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్)
- ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2

తమిళం
- ఉత్తమ చిత్రం - అరమ్
- ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద)
- ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద)
- ఉత్తమ నటి - నయనతార (అరమ్)
- ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు)
- ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి)
- ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ)
- ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్
- ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న
- ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్
- ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి
- ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్)
- ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి)

మలయాళం
- ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్
- ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్
- ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్
- ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్)
- ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్
- ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్
- ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ
- ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్
- ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు)
- ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్
- ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర
- ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది)
- ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్)
- ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి

కన్నడ
- ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె
- ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక)
- ఉత్తమ నటుడు - రాజ్ కుమార
- ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్
- ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ
- ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్
- ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక)
- ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్
- ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్
- ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్
- ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్
- ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com