ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 22, 2018, 02:50 PM



ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల రెమ్యునరేష్ కన్నా ఇతర నటీనటుల పారితోషికమే ఎక్కువగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారి కోసం స్పెషల్ షెడ్యూల్ సెట్ చేసుకుంటున్న దర్శకులు కూడా ఉన్నారు. రోజుకు లక్షల్లో ఛార్జ్ చేసే వారి సంఖ్య చాలానే ఉంది. కమెడియన్స్ చాలానే అందుకుంటున్నారు. ఇప్పుడు కమెడియన్ గా మరీన సునీల్ అయితే రోజుకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అందుకుంటున్నాడు. ఇక సీనియర్ యాక్టర్ నరేష్ రోజుకి 1.5 లక్షలు అందుకుంటున్నారు. వెన్నల కిషోర్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. స్టార్ కమెడియన్స్ లలో అతనికి ఆదరణ ఎక్కువగా అందుతోంది. దాదాపు  రోజుకి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. రావు రమేష్ అయితే 2.5 లక్షల ఉంటుందట. వీరందరికి కాల్షీట్స్ బట్టి కూడా ఒక రౌండ్ ఫిగర్ అమౌంట్ ఉంటుందని ఒక టాక్ ఉంది. అయితే చాలా వరకు డైలీ పేమెంట్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే తటాలీవుడ్ శివగామి రమ్య కృష్ణ కు బాహుబలి తరువాత డిమాండ్ చాలా పెరిగిపోయింది. 


ప్రస్తుతం ఆమె నాగ చైతన్య చేస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ రోల్ లో కనిపించనుంది. అందుకు 25 కాల్షీట్స్ తీసుకున్న చిత్ర యూనిట్ రోజుకి 6 లక్షల చొప్పున అందిస్తున్నారట. అంటే మొత్తంగా 1.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతోందని టాక్ వస్తోంది. రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ ఒక కోటి వరకు తీసుకుంటున్నారు. తమన్నా ఫెడవుట్ తరువాత 60 లక్ష తీసుకుంటోంది. కానీ వారందరికంటే రమ్య కృష్ణ మాత్రం ఎక్కువగా తీసుకోవడం చూస్తుంటే ఆమె హీరోయిన్స్ కంటే సినిమాకు చాలా అవసరం అని అర్ధమవుతోంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com