ఒకప్పటి అందాల భామ కాజోల్ షాపింగ్ మాల్లో పట్టు తప్పి కిందపడింది. పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ సాయమందించడంతో ఎలాంటి దెబ్బలు తగలలేదు. కాని కాజోల్ కింద పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హెల్త్ గ్లో స్టోర్‌లోని ఈవెంట్లో పాల్గొనడానికి ఫోనిక్స్ మార్కెట్ సిటీ మాల్‌కు వచ్చింది కాజోల్. పొనిటైల్ వేసుకుని, మోకాలు వరకు ఉన్న తెల్లటి డ్రస్ , హైహీల్స్ తో మాల్ లో మెరిసింది . కాజోల్‌ని చూసేందుకు జనాలు ఎగబడడంతో వారిని తప్పించుకునేందుకు వేగంగా నడవసాగింది. ఈ క్రమంలో పట్టుజారీ కిందపడింది. దిల్వాలే ప్రమోషన్స్ సమయంలో కూడా కాజోల్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. స్టేజీపై ఆమె కింద పడబోతే, ఆమె సహ నటుడు వరుణ్ దావన్ పట్టుకున్నాడు .