ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిప్ లాక్ లు చేయ‌నంటే…

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 18, 2018, 11:33 AM



లిప్‌లాక్‌ (ముద్దు) సన్నివేశాల్లో నటించనని చెబితే మూడు పెద్ద సినిమాల్లో అవకాశాలు పోయాయి. అయినప్పటికీ తానెంత మాత్రం కలత చెందడం లేదని అందాల భామ మడోన్నా సెబాస్టియన్‌ వెల్లడించింది. లిప్‌లాక్‌ సన్నివేశాలు లేకుండా చాలా సినిమాలు రూపొందడం లేదంటే అతిశయోక్తి కాదేమో. గతంలో కూడా ముద్దు సన్నివేశాలున్నా ఇప్పుడున్నంత గాఢంగా అప్పట్లో లేవనే చెప్పాలి. ఏదిఏమైనా ఇప్పుడు ముద్దు సన్నివేశాలు సాధారణమే అన్నట్లుగా అయిపోయినా కొంతమంది ప్రేక్షకులు వీటిని విమర్శిస్తున్న సంగతి వింటున్నదే. ఇలాంటి విమర్శకుల కోవలోనే మడోన్నా కూడా దీనిపట్ల వ్యతిరేకం వ్యక్తం చేస్తోంది. గాయనిగా మారేందుకు ఆరేళ్ల ప్రాయం నుంచే సంగీత శిక్షణ పొందిన ఆమె ఊహించనివిధంగా సినిమా నటి అయింది.


మూడేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన ప్రేమమ్‌ చిత్రం ద్వారా పరిచయమైన ఆమె ఆ తొలి చిత్రం విజయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్నుంచి తమిళ రంగంలో కూడా ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చాయి. ప్రేమమ్‌ తెలుగు రీమేక్‌లో కూడా ఆమె నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమైంది. తెలుగులో ఆ తర్వాత అవకాశాలు రాకపోయినా ఇతర భాషల్లో ఆమెకు అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ…తెలియనివారితో మాట్లాడాలన్నా భయపడే మనస్తత్వం నాది. మొదటిసారి కౌగిలింత సన్నివేశంలో నటించిన తర్వాత కూడా ఏడ్చేశా. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆ భయం పోయింది. కథకే నా మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాత నా పాత్రకు ప్రాముఖ్యం ఇస్తాను. దర్శకుడు ఎవరన్న అంశం..అలాగే పారితోషికం వంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుని సినిమాలను అంగీకరిస్తుంటాను అని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com