నటసింహ బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్ పేరుతో రూపొందుతున్నది.. క్రిష్ దర్శకత్వం వహింస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్నది.. ఇప్పటికే ఆమె షూటింగ్ లో పాల్గొంటున్నది.. షూటింగ్ ముందే హైదరాబాద్ చేరుకున్న ఆమె బాలకృష్ణ ఇంటికి వెళ్లారు.. ఆమెను కుటుంబ సభ్యులు గౌరవంగా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా బసవ తారకం గురించి పలు విషయాలను నందమూరి కుటుంబం నుంచి అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా విద్యా బాలన్ కు చీరను అందించి సత్కరించింది బాలయ్య కుటుంబం.. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, అతడి భార్య వసుందర, సోదరి లోకేశ్వరీ, కుమార్తె తేజస్వినీ, శ్రీభరత్ పాల్గొన్నారు..