ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఫొటో షూట్‌ గురించే ఇంత చర్చ అవసరమా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2017, 11:36 AM



ఇషా గుప్తా... ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ హాట్‌ టాపిక్‌. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఆమె పెట్టిన ఫొటోలు నెటిజన్ల మతిపోగేట్టాశాయి. టాప్‌లెస్‌గానూ, లోదుస్తుల్లో అర్థనగ్నంగా ఉన్న ఇషా ఫొటో షూట్‌పై పెద్ద చర్చే జరుగుతోంది. లింగ బేధం లేకుండా నా ఫొటోలపై విమర్శలు చేసిన మగ, ఆడ నెటిజన్లకు నేను చెప్పేది ఏంటంటే ‘‘ఓ భారతీయ అమ్మాయి అందాల ఆరబోస్తుంటే చూసి వాళ్ల మగతనం ఎక్కడ షేక్‌ అవుతుందో అని మగాళ్లు కంగారు పడిపోతున్నారు. 


ఆత్మవిశ్వాసం లేని ఆడవాళ్లే నన్ను విమర్శిస్తున్నారు. నా ఫొటోలపై వస్తున్న కామెంట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. వాళ్ల మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతోంది. ప్రపంచం తిరోగమనం వైపు వెళ్లిపోతుందా? అనే సందేహం కలుగుతోంద’’ని చెబుతోంది ఇషా. ‘అసలు ఓ భారతీయ అమ్మాయి చేసే పనేనా?, ‘ఇషా భారతీయురాలే కాదు....’ ఈ విమర్శలే నన్ను ఎక్కువ బాధపెడుతున్నాయి అంటోంది ఇషా. ‘‘నన్ను విమర్శించే అందరి కంటే నేనే అసలు సిసలు భారతీయురాల్ని. నా తండ్రి దేశానికి ఎంతో సేవ చేశారు. మరి మీ తండ్రి చేశారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇషా. ‘‘ప్రపంచంలో ఇన్ని సమస్యలుండగా నా ఫొటో షూట్‌ గురించే ఇంత చర్చ అవసరమా? మన చుట్టూ ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ముందు వాటి గురించి మాట్లాడండి’’ అని గట్టిగానే చెబుతోంది ఇషా గుప్తా. ‘‘నన్ను విమర్శిస్తూ చాలామంది మెయిల్స్‌ పెట్టారు. వాళ్లందరికీ నెగెటివ్‌గా సమాధానం ఇవ్వలేదు. మరిన్ని ఫొటోలు పోస్ట్‌ చేశాను. నేను అందంగా ఉంటాను. నా అందాలను బంధించిన ఫొటోలు నాకు నచ్చాయి. వాటిని పంచుకున్నాను’’ అని నిర్మొహమాటంగా చెప్పేసింది ఇషా. తాజాగా ఈ భామ నటించిన అజయ్‌దేవగణ్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘బాద్‌షాహో’ త్వరలోనే విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com