‘క్వాంటికో’ టెలివిజన్ షో ద్వారా గ్లోబల్ నటి ప్రియాంకచోప్రా హాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైంది. ఈ అమెరికన్ షోతో ప్రియాంక అక్కడి వారిని ఆకట్టుకోవడమే కాదు, వెండితెరపైనా అవకాశాలు చేజిక్కించుకొంటూ పాపులర్ అయింది. ఇప్పుడు ప్రియాంక ఓ వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో సైఫ్ అలీఖాన్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ప్రియాంక కూడా వెబ్‌సిరీస్‌లో నటించడానికి సిద్ధం కావడంతో డిజిటల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ ఏంటో అర్థమవుతుంది. ఓ ఫిక్షన్ జోనర్‌తో సాగే కథలో ప్రియాంక నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ వెబ్‌సిరీస్‌లో కనిపించి ప్రియాంక మరింత పాపులర్ కావడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.