బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ల వివాహం త్వరలోనే జరగనుందని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ వీరిద్దరూ ఈ విషయంపై స్పందించిన దాఖలాల్లేవ్. బహుశా ఈ ఏడాదిలో వీళ్లు వార్తల్లో నిలిచినంతగా మరెవరూ లేరనే చెప్పుకోవాలి!. అయితే తాజాగా మీడియా ప్రతినిధులు పెళ్లి గురించి అడగ్గా.. ఆమె నవ్వేసి ఊరుకుంది. అంతేకాదు ఇటీవల ఆమె ధరించిన ఉంగరం కూడా ఎంగేజ్మెంట్దేనని రూమర్స్ వచ్చాయి.