విజయ్ సినిమా.. లావణ్య వద్దందా?

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 06, 2017, 12:04 PM
 

పెళ్లి చూపులు మూవీతో క్లిక్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు అర్జున్ రెడ్డితో సడెన్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసేసుకున్నాడు. మరి ఇలాంటి హీరోతో ఓ సినిమా అవకాశాన్ని హీరోయిన్స్ కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. కుర్రాళ్లకు దగ్గరైపోవడానికి ఈ ఛాన్స్ ను సహజంగా మిస్ చేసుకోరు భామలు.


కానీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాత్రం విజయ్ దేవరకొండ హీరోగా తను సైన్ చేసిన సినిమా నుంచి కూడా తప్పుకుందనే న్యూస్.. టాలీవుడ్ లో తెగ హల్ చల్ చేసేస్తోంది. అది కూడా గీతా ఆర్ట్స్ లాంటి ప్రముఖ బ్యానర్ లో రూపొందే సినిమా నుంచి ఓ హీరోయిన్ ఎగ్జిట్ అంటే.. అది చిన్న విషయం కాదు. అల్లు శిరీష్ తో శ్రీరస్తు.. శుభమస్తు అంటూ హిట్ కొట్టిన దర్శకుడు పరశురాం..  విజయ్ దేవరకొండ- లావణ్య త్రిపాఠి జంటగా ఓ సినిమా రూపొందించాల్సి ఉంది. అయితే.. ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు నో చెప్పేసిందట లావణ్య త్రిపాఠి. స్క్రిప్ట్ నుంచి అన్ని విషయాలు నచ్చినా సరే.. ఏదో పర్సనల్ రీజన్స్ తోనే ఈ సినిమా నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేందుకు లావణ్య త్రిపాఠి ఫిక్స్ అయి.. అదే విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పడం.. వాళ్లు ఒప్పుకోవడం జరిగిపోయాయని అంటున్నారు.


కానీ అసలు మ్యాటర్ వేరే ఉందట. సహజంగా పరశురాం దర్శకత్వంలో రూపొందే సినిమాల్లో హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత.. కథ విషయంలో మార్పులు చేర్పులు చెబుతున్నాడట విజయ్ దేవరకొండ. తనకు చెప్పిన స్క్రిప్ట్ కాకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత లేకుండా స్టోరీ మారిపోతోందనే విషయాన్ని గ్రహించిన లావణ్య త్రిపాఠి.. సైలెంట్ గా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలీదు కానీ.. ప్రస్తుతానికి కొత్త హీరోయిన్ ను వెతుక్కునే పనిలో ఉన్నారన్నది మాత్రం నిజమే. 
Recent Post