ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధమ్కీ' డే వన్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 02:47 PM



టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'ధమ్కీ' మార్చి 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు స్వయంగా దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియన్ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.06 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ విశ్వక్సేన్ కి జోడిగా నటిస్తుంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత అందిస్తున్నారు.


'ధమ్కీ' కలెక్షన్స్ :::::
నైజాం : 91 L
సీడెడ్ : 43 L
UA : 40 L
ఈస్ట్ : 30 L
వెస్ట్ : 20 L
గుంటూరు : 40 L
కృష్ణ : 25 L
నెల్లూరు : 17 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ : 3.06 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com