సినీనటుడు శ్రీకాంత్ ఈ రోజు 55వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రేక్షకాభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాతో 1991లో సిని తెరంగేట్రం చేసిన శ్రీకాంత్, మొదట్లో చిన్నచిన్న పాత్రలతో విలన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, నెమ్మదిగా హీరోగా మారారు. 1995లో వచ్చిన వన్ బై టు చిత్రంతో లీడ్ హీరోగా మారారు. ఆ తరవాత వచ్చిన తాజ్ మహల్ మంచి విజయం సాధించడంతో, శ్రీకాంత్ హీరోగా నిలదొక్కుకున్నారు. ఆపై 100 సినిమాలలో లీడ్ హీరోగా నటించి, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించారు.