టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ రాజా రవితేజ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా, చిన్నా చితక వేషాలు వేస్తూ, కష్టపడి పైకొచ్చిన హీరోగా, మాస్ రాజాగా, మాస్ మహారాజాగా ప్రేక్షకులలో ఆయనకొక ప్రత్యేక గుర్తింపు ఉంది.
తాజాగా రవితేజ కుటుంబం నుండి ఒక కొత్త హీరో పరిచయం జరిగింది. రవితేజ అన్న రఘు కొడుకు మాధవ్ హీరోగా, పెళ్లి సందడి ఫేమ్ గౌరీ రోణంకి డైరెక్టర్గా ఈ రోజే ఒక కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రకటింపబడింది. JJR ఎంటర్టైన్మెంట్స్ LLP లో ప్రొడక్షన్ నెంబర్ 2గా రూపొందుతున్న ఈ సినిమాను యలమంచి రాణి సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటింపబడనున్నాయి.
పోతే, పూజా కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, సురేష్ బాబు గారు విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియచేసారు.