నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా నవరాత్రి ప్రచార కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దసరా ప్రమోషన్స్ ఆరంజ్ సిటీ నాగపూర్ లో జరుగుతున్నాయి. అక్కడి ప్రెస్ తో ముచ్చటించాక, ఒక ట్రాక్టర్ ను నాని నడపడం జరిగింది. నాగపూర్ విధుల్లో దసరా విడుదల తేదీ రాసిఉన్న ట్రాక్టర్ ను నాని నడిపారు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా మార్చి 30న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.