మాస్ రాజా రవితేజ అన్న రఘు కొడుకు మాధవ్ హీరోగా, టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. పెళ్లి సందడి ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వంలో, JJR ఎంటర్టైన్మెంట్స్ LLP బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2 గా రూపొందుతున్న ఒక సినిమాలో మాధవ్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ రోజే అధికారిక పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
ఈ నేపథ్యంలో కొడుక్కి రవితేజ ఇండస్ట్రీలోకి గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ స్పెషల్ ట్వీట్ చేసారు. మాధవ్ ని తమ ప్రేమాభిమానాలతో ఆదరించాలని ఈ సందర్భంగా రవితేజ ప్రేక్షకులను కోరారు.