ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆరెంజ్' లేటెస్ట్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:42 PM



టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరంజ్' సినిమా 2010 బాక్స్ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా మార్చి 25, 2023న ఈ సినిమా రి రిలీజ్ గా విడుదలైంది. ఈ సినిమా రి రిలీజ్ అయ్యిన అన్నిచోట్లా అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద ఈ చిత్రం 3.00 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ కలెక్షన్లను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విరాళంగా అందజేయనున్నారు. ఈ సినిమాలో ప్రభు, ప్రకాష్ రాజ్, పవిత్రా లోకేష్, బ్రహ్మానందం, అవసరాల శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాగబాబు నిర్మించిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com