ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USA బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న 'దసరా'

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:43 PM



శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "దసరా" సినిమా మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయ్యిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన మొదటి రోజున (ప్రీమియర్‌లతో సహా) $850K కలెక్ట్ చేసినట్లు సమచారం. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ఎలైట్ $1 మిలియన్ క్లబ్‌లో చేరనుంది అని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com