ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమౌళి మాటలతో 'ఆర్ ఆర్ ఆర్' అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 06:35 PM



దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రూ.300 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి.. ఈ చిత్రం ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదని.. ఇదొక పాన్ ఇండియా చిత్రమని వెల్లడించారు. z


 


రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్ చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇదొక పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇటీవల లీక్ అయిన కొన్ని షూటింగ్ తాలుకు ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధృవ పరుస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com